అక్రమాలకు పాల్పడుతున్న విలేకరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-28T06:53:49+05:30 IST

వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను బెదిరిస్తూ వారినుంచి నగదు వసూలు చేస్తున్న నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విలేకరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

అక్రమాలకు పాల్పడుతున్న విలేకరి అరెస్ట్‌
రాంప్రసాద్‌

దామరచర్ల, జూన 27: వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను బెదిరిస్తూ వారినుంచి నగదు వసూలు చేస్తున్న నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విలేకరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ రవికుమార్‌ సమాచారం మేర కు వివరాలిలా ఉన్నాయి. దామరచర్లకు చెందిన కందుల రాంప్రసాద్‌ ఒక దినపత్రికలో(ఆంధ్రజ్యోతి కాదు) విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన దామరచర్లలో సిరసాల నాగయ్యను బె దిరించి ఇంటి నిర్మాణ అనుమతులు లేవని బెదిరించి రూ.25వేలు తీసుకున్నాడు. నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా, నిషేధిత గుట్కాలు, రేషనబియ్యం అక్రమ వ్యాపారాలు చేయడమే కాకుండా సివిల్‌ తగాదాల్లో తలదూర్చేవాడని తెలిసింది. స్థానిక వ్యాపారులను, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విచారణలో తేలింది. దీంతో సోమవారం రాంప్రసాద్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అతడికి సహకరించిన చిన్న పత్రికల విలేకరులు నక్క శ్రీనివాస్‌, ధీరావత శ్రీనివా్‌సపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.


Updated Date - 2022-06-28T06:53:49+05:30 IST