జాషువా కవితలు దేశ సంపద

ABN , First Publish Date - 2022-09-29T03:55:03+05:30 IST

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన కవితలు దేశానికి సంపద అని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

జాషువా కవితలు దేశ సంపద

విగ్రహావిష్కరణ సభలో మంత్రి సురేష్‌

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 28 : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన కవితలు దేశానికి సంపద అని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుర్రం జాషువా జయంతి  కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్‌లో జాషువా విగ్రహన్ని మంత్రి ఆవిష్కరించారు. జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ దళిత గబ్బిలం అనే పేరుతో తన కవితతో ఈశ్వరుడికే సందేశాన్ని పంపిన మహానీయుడు జాషువా అని కొనియా డారు.  గుంటూరు టౌన్‌లో అర ఎకరం స్థలంలో రూ.2 కోట్లతో గుర్రం జాషువా  విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి,  మాజీ చైర్మన్‌ మూర్తిరెడ్డి, ఎంపీపీలు డీ కిరణ్‌గౌడ్‌, కోట్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ జాన్‌పాల్‌, స ర్పంచ్‌ ఆర్‌.అరుణాబాయి, కోఆప్టెడ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌, ఆర్యవైశ్య నాయకులు యిమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, నాయకులు రాచగొర్ల పిచ్చయ్య యాదవ్‌, ఎన్జీవో అధ్యక్షుడు చేదూరి రవికుమార్‌, 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు, విగ్రహ కమిటీ నిర్వాహకులు నాగయ్య, దళిత నాయకులు పాల్గొన్నారు.

గిద్దలూరులో..

గిద్దలూరు : పట్టణంలోని రిటైర్డ్‌ హోంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా గురూజీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పద్మభూషన్‌ గుర్రం జాషువా  జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాషువ చిత్రపటానికి పూలమాల లు వేసి  ఘనంగా నివాళులర్పించారు. తెలుగుజాతికి పట్టి పీడిస్తున్న కులమతాలను ఆయన కలంతో కవితల ద్వారా ఎండగట్టారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, చెస్‌ క్రీడాకారుడు శివకుమార్‌, తెలుగు పండిట్‌ మురళీకృష్ణ, రామకృష్ణ ధ్యానమందిరం అధ్యక్షు డు హనుమంతరెడ్డి, చిన్ని సంస్థ అధ్యక్షుడు శ్రీకాంత్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల :  గ్రంథాలయంలో భగత్‌సింగ్‌, గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని బుఽధవారం నిర్వహించారు. గ్రంథపాలకుడు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, జాషువా చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్‌రా వు, సచివాలయం సిబ్బంది కాశింసాహెబ్‌, గోపి, యేసు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T03:55:03+05:30 IST