నిరుద్యోగుల్లో జోష్‌

ABN , First Publish Date - 2022-04-27T04:12:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో ఆశావాహుల్లో జోష్‌ నెలకొంది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలో జోన్‌ల వారీ గా పోస్టులు, ఖాళీలను ప్రకటించింది.

నిరుద్యోగుల్లో జోష్‌
లోగో

- పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల
- జిల్లాలో వివిధ కేటగిరిల్లో 193 ఖాళీలు
- కొలువు సాధించేందుకు యువత శిక్షణ

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 26: రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో ఆశావాహుల్లో జోష్‌ నెలకొంది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలో జోన్‌ల వారీ గా పోస్టులు, ఖాళీలను ప్రకటించింది.  ఎస్సై, కానిస్టేబుల్‌, జైల్‌ వార్డర్‌, ఆగ్నిమాపక శాఖల్లో ఉద్యోగల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. నిరుద్యోగ అభ్యర్థులు మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వెల్లడించారు.  ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు ఇతర కసరత్తులో యువత బీజీగా ఉన్నారు. కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న యువత లక్ష్య సాధనకు పుస్తకాలతో కుస్తీలు మొదలు పెట్టారు. పట్టుదలతో చదవి ఖాకీ ఉద్యోగం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

- కుమరం భీం జిల్లాలో..
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 193 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సివిల్‌ కానిస్టేబుళ్లు 108, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 74, అగ్నిమాపక శాఖ ఫైర్‌మెన్‌లు 11 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేం దుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పోలీసుస్టేషన్‌ల వారీగా ప్రిలిమినరీ పరీక్షల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీశాఖల ద్వారా ఆయా వర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.

- గట్టి పోటీయే..
పోలీసు కావాలన్న తాపత్రం యువతలో ఉన్న నేపథ్యంలో ఈ సారి ఉద్యోగ సాధనకు గట్టి పోటీయే ఉండనుంది. గత రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్న పోలీసు శాఖలో కొలువుల ప్రక్రియ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ చేసింది. ఖాళీల సంఖ్య జిల్లాల వారీగా ప్రకటించటంతో నిరుద్యోగులు ఇప్పుడు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు.  ఈ మేరకు హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందేందుకు యత్నిస్తున్నారు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్న కొంత మంది ఇంటి వద్దనే ఉండి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా పోలీసు శాఖలో శారీర దారుఢ్య పరీక్ష అతి కీలకంగా ఉండడంతో ఉదయం వేళల్లో క్రీడా మైదానాల్లో పరుగు, వ్యాయామ ప్రక్రియ చేస్తున్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్ర మానికి  పలువురు యువకులు వెళ్లారు.  ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం వయస్సు సడలింపు ఇవ్వడంతో వయస్సు మీరుతున్న వారు సైతం ఉద్యోగ సాధనకు సిద్ధమవుతున్నారు. దరఖాస్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా పరీక్షలకు ప్రిపేపర్‌ అవుతున్న యువత  ప్రస్తుతం ఉన్న అంశాలతో పాటు తాజా జీకేపై దృష్టి సాధించాలని సూచిస్తున్నారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగం సాదించడమే లక్ష్యం
- ఎండీ ఆర్షద్‌, ఆసిఫాబాద్‌

కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నాం. గతంలో నిర్వహించిన కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలో ఐదు మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేకపోయాను. ఈసారి ఉద్యోగం సాధించాలని పట్టుదలతో కృషి చేస్తున్నాను.

యువత సద్వినియోగం చేసుకోవాలి
- అచ్చేశ్వర్‌రావు, ఏఎస్పీ

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసినందున యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణా ళిక, క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటే పోలీసు ఉద్యోగం దక్కుతుంది. చదువుతో పాటు ఫిజికల్‌ పరీక్షలు కీలకం కావడంతో రెండింటిలోనూ ప్రతిభ చాటాలి. యువతకు ఫిజికల్‌ ఈవెంట్స్‌పై అవసరమైన మెల కువలను పోలీసుశాఖ ఆధ్వర్యంలో అందజేస్తాం.

Updated Date - 2022-04-27T04:12:27+05:30 IST