IPL2022: ఆరెంజ్ క్యాప్ వీరుడెవరు?.. 50 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి..

ABN , First Publish Date - 2022-05-07T00:33:53+05:30 IST

ముంబై : IPL2022 మాంచి జోరుగా కొనసాగుతోంది. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ దాదాపు అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సీ

IPL2022: ఆరెంజ్ క్యాప్ వీరుడెవరు?.. 50 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి..

ముంబై : IPL2022 మాంచి జోరుగా కొనసాగుతోంది. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ దాదాపు అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సీజన్ తుది అంకానికి చేరుకుంటున్న వేళ ఆరెంజ్ క్యాప్‌ను ఎవరు దక్కించుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్న బ్యాట్స్‌‌మెన్స్ ఎవరు, ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం...


IPL2022 సీజన్‌లో 50 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి Rajastan royals స్టార్ ప్లేయర్ Jos buttler ఎవరికీ అంతనంత ఎత్తులో ఉన్నాడు. ఈ సీజన్ మొదటి నుంచి దుమ్మురేపుతున్న బట్లర్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఏ ఇతర బ్యాట్స్‌మెన్ బట్లర్‌ను అధిగమించలేదు. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో శిఖరాగ్రాన కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో బట్లర్ బెస్ట్ స్కోరు 116 పరుగులుగా ఉంది. అయితే 2వ స్థానంలో ఉన్న Luckonw super Giants కెప్టెన్ KL Rahul మాత్రమే బట్లర్‌కు పోటీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 451 పరుగులతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్యా ఇంకా 137 పరుగుల వ్యత్యాసం ఉంది.


ఆరెంజ్ క్యాప్ రేసులో 3వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఉన్నాడు. ధవన్ 11 మ్యాచుల్లో 369 పరుగులు చేశాడు. ఇక స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో 92 పరుగుల భారీ స్కోర్ చేసి ఈ సీజన్‌ మొత్తం పరుగులను 356కు పెంచుకున్నాడు. గురువారం జరిగిన ఇదే మ్యాచ్‌లో 8 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 331 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

Read more