జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి

ABN , First Publish Date - 2021-05-14T06:05:23+05:30 IST

రాష్ట్రంలో పని చే స్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ వారి యర్స్‌గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అ ధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురు వారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తో జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన అనంతరం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి
ఎంపీ మాగుంటను కలిసిన ఐవీ.సుబ్బారావు, ప్రతినిధులు

పాత్రికేయుల సంక్షేమంపై  సీఎం నిర్లక్ష్యం

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు


ఒంగోలు(కలెక్టరేట్‌), మే 13 : రాష్ట్రంలో పని చే స్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ వారి యర్స్‌గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అ ధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురు వారం  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తో జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన అనంతరం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో పలు మీడియాసంస్థలు దెబ్బతినడంతో పా టు 60మంది వరకు జర్నలిస్టులు మృత్యువాతపడ టం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సం క్షేమంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం ఆలోచించక పోవడం దుర్మార్గంగా ఉందని ఐవీ ఆరోపించారు. కరోనా మొదటివేవ్‌లో మృతిచెందిన జర్నలిస్టుల కు టుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తా మని హామీ ఇచ్చినా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలు జర్న లిస్టులను ఫ్రంట్‌వారియర్స్‌గా గుర్తించామని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం తక్షణమే చ ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో జ ర్నలిస్టుల సమస్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ పో లా భాస్కర్‌తో చర్చించామన్నారు. మంత్రి  బాలినే ని కరోనా బారినపడిన జర్నలిస్టులకు ఉచితంగా రె మ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ అంశంపై ఈనెల 15న మంత్రి ప్రకటిస్తారని వె ల్లడించారు. ఎంపీ మాగుంట తన జర్నలిస్టుల సం క్షేమం కోసం అవసరమైన సహకారం అందించేం దుకు హామీ వచ్చి ఈ మేరకు కార్యాలయల ప్రతి నిధులకు పలు సూచనలు చేశారని చెప్పారు. కలె క్టర్‌ పోలా భాస్కర్‌ జర్నలిస్టులందరికీ టీకాతో పా టు పాజిటివ్‌ వచ్చిన వారికి బెడ్లుకేటాయింపు చే స్తానని హామీ ఇచ్చారని ఐవీ పేర్కొన్నారు. కార్యక్ర మంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి దాసరి కనక య్య, ఎ.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-14T06:05:23+05:30 IST