భక్తులతో జొన్నవాడ ఆలయం కిటకిట

ABN , First Publish Date - 2022-08-13T04:45:41+05:30 IST

శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని జొన్నవాడ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

భక్తులతో  జొన్నవాడ ఆలయం కిటకిట
జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయిని దర్శించుకుంటున్న భక్తులు.

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు12 :  శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని జొన్నవాడ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. పలువురు మహిళలు ఆలయంలో పిండిదీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన గంగా, కామాక్షితాయి సమేత శ్రీ మల్లికార్జునస్వామి నిత్య కల్యాణోత్సవం భక్తులను అలరించింది. రాత్రి ఆలయంలో కామాక్షితాయికి సామూహిక కుంకుమార్చన, పల్లకిసేవలు నిర్వహించారు.

న్నదానానికి రూ. లక్ష విరాళం

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు12: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయ నిత్యాన్నదాన సదనానికి శుక్రవారం ఇద్దరు దాతలు వేర్వేరుగా లక్షా నూటపదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. రేబాలకు చెందిన పోతిరెడ్డి శకుంతలమ్మ, కుటుంబసభ్యులు 50వేలు, కొడవలూరు రాగమ్మ జ్ఞాపకార్థం అమెరికాకు చెందిన స్వర్ణలత రూ. 50,116 ఆలయ చైర్మెన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లుకి అందజేశారు. ముందుగా  ఆలయ అర్చకులు వారి గోత్రనామాలతో స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-08-13T04:45:41+05:30 IST