జొన్నవాడ ఆలయంలో బహిరంగ వేలం

ABN , First Publish Date - 2022-01-29T04:12:38+05:30 IST

మండలంలోని జొన్నవాడ ఆలయం వద్ద పర్యాటక అతిఽథిగృహంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించే తలనీలాలు సేకరించే హక్కును నడికుడికి చెందిన రొడ్డా కోటేశ్వరరావు రూ.9,50,000లకు దక్కించుకున్నట్లు ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

జొన్నవాడ ఆలయంలో బహిరంగ వేలం
జొన్నవాడలో బహిరంగ వేలం, పాల్గొన్న పాటదారులు

 బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 28: మండలంలోని జొన్నవాడ ఆలయం వద్ద పర్యాటక అతిఽథిగృహంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించే తలనీలాలు సేకరించే హక్కును నడికుడికి చెందిన రొడ్డా కోటేశ్వరరావు రూ.9,50,000లకు దక్కించుకున్నట్లు ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కొబ్చరి చిప్పలు, వస్ర్తాలు సేకరించుకునే వేలం పాటలకు పాటదారులు ముందుకు రాకపోవడంతో అవి వాయిదా వేశారు. అదే విధంగా పాదరక్షలు భద్రపరచే హక్కు, చాపలు, పీటలు అద్దెకు ఇచ్చుకునే వేలంలో పాటదారులు పాల్గొనకపోవడంతో వాటిని కూడా వాయిదా వేశారు. గోశాలలో ఎరువు అమ్మకానికి నిర్వహించిన వేలంలో స్థానిక రైతు శింగిరి ప్రసాద్‌ రూ.20వేలకు పాడుకున్నారు. కిరాణా, కూరగాయలతోపాటు పలు టెండర్లకు పలువురు కోడ్‌చేయగా.. సీల్డ్‌ టెండర్ల వాయిదా వేసినట్లు ఈవో తెలిపారు. వేలం పాటలకు అధిక సంఖ్యలో పాటదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే. చైతన్య, పలువురు అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T04:12:38+05:30 IST