Abn logo
Aug 14 2020 @ 03:19AM

యూఎస్‌ ఓపెన్‌ బరిలో జొకో

పారిస్‌: స్టార్‌ ప్లేయర్లు ఒక్కొక్కరుగా దూరమవుతుండడంతో కళ తప్పుతున్న యూఎస్‌ ఓపెన్‌లో వరల్డ్‌ నం:1 నొవాక్‌ జొకోవిచ్‌ ఉత్సాహం నింపాడు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత జరగనున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు. ఈ క్రమంలో మెగా టోర్నీకి జొకో కూడా దూరమవుతాడనే ఊహాగానాలకు తెరదించాడు. ‘ఈ ఏడాది జరిగే సిన్సీ టెన్నిస్‌, యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొంటున్నా. ఎన్నో అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ, మళ్లీ పోటీల్లో బరిలోకి దిగనుండడం ఉత్సాహాన్నిస్తోంద’ని జొకో ట్వీట్‌ చేశాడు. ఖాళీ స్టేడియాల్లో ఈనెల 31 నుంచి యూఎస్‌ ఓపెన్‌ జరగనుంది. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌, మహిళల టాప్‌ ప్లేయర్‌ ఆష్లే బార్టీ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు ఈపాటికే ప్రకటించారు. కాగా, కరోనా బారినపడిన జొకో కోలుకున్న సంగతి తెలిసిందే. 


Advertisement
Advertisement
Advertisement