విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా Margaret Alva నామినేషన్.. తరలివచ్చిన అతిరథులు

ABN , First Publish Date - 2022-07-19T22:15:13+05:30 IST

న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు.

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా Margaret Alva నామినేషన్.. తరలివచ్చిన అతిరథులు

న్యూఢిల్లీ: Joint Opposition Vice Presidential candidateగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు Margaret Alva నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు. తనకు మద్దతిచ్చిన పార్టీల నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 






మరోవైపు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్ నిన్ననే నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతల సమక్షంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి 780 మంది ఎంపీలకుగాను బీజేపీకి సొంతంగా 394 మంది సభ్యులున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు మ్యాజిక్‌ మార్కు 391 ఓట్లే. ఎన్డీయేకు మరికొన్ని ఇతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. దీంతో జగదీప్‌ ధన్‌ఖడ్‌ గెలుపు ఖాయమైనట్లేనని భావిస్తున్నారు.



Updated Date - 2022-07-19T22:15:13+05:30 IST