పంటనష్ట పరిహారం కోసం ఉమ్మడి జిల్లా రైతుల ఎదురు చూపులు

ABN , First Publish Date - 2021-01-24T04:57:04+05:30 IST

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నియంత్రిత సాగు విధానం వల్ల.. మరోవైపు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి రాక.. మార్కెట్‌లో పంటల ఉత్పత్తులకు మద్ద తు ధర దొరక్క అన్నదాతలు గత వానాకాలం సీజన్‌లో తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలతో వేల ఎకరా లలో ఉమ్మడి జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి.

పంటనష్ట పరిహారం కోసం ఉమ్మడి జిల్లా రైతుల ఎదురు చూపులు
భారీ వర్షాలకు నేలకొరిగిన వరి పంట (ఫైల్‌)

గత వానాకాలంలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు

21 వేల ఎకరాలలో పంటలు దెబ్బతిని.. సుమారు రూ.10 కోట్ల వరకు నష్టం

నష్టపోయిన 30వేల మందికి పైగా రైతులు

వరి, పత్తి రైతులకే ఎక్కువ నష్టం

నియంత్రిత సాగులో సన్నాల సాగు

పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటున్న ఉభయ జిల్లాల అన్నదాతలు

కామారెడ్డి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నియంత్రిత సాగు విధానం వల్ల.. మరోవైపు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి రాక.. మార్కెట్‌లో పంటల ఉత్పత్తులకు మద్ద తు ధర దొరక్క అన్నదాతలు గత వానాకాలం సీజన్‌లో తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలతో వేల ఎకరా లలో ఉమ్మడి జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో దిగుబడి రాక.. వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాక పంటనే దగ్ధం చేసి రైతులు నిరసన వ్యక్తం చే సిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. అకాల వర్షా లతో ఉమ్మడి జిల్లాలో సుమారు 21 వేల ఎకరాలకుపై గా పంటలు దెబ్బతినగా రూ.10 కోట్ల వరకు నష్టం వా టిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసి ప్రభు త్వానికి నివేదించారు. కానీ ఇప్పటివరకు పంట నష్టపరి హారంపై ప్రభుత్వం ఎలాంటి నోరు మెదపకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 వేల మందికి పైగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

 ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్ల నష్టం

గత వానాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో లక్షల ఎ కరాలలో రైతులు పంటలను సాగుచేశారు. సాగుకు అ నుగుణంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సరిగ్గా చేతి కి వచ్చే సమయంలో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల కా రణంగా వేల ఎకరాలలో పంటలు నీట మునగడంతో దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, సో యాబీన్‌ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 21 వేల ఎకరాలకుపైగా వివిధ పం టలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వే శారు. నిజామాబాద్‌ జిల్లాలో 22 మండలాలోని 71 గ్రా మాల్లో 1800 ఎకరాలలో వరి, 100 ఎకరాలలో సోయా పంట దెబ్బతిన్నది. సుమారు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కామా రెడ్డి జిల్లాలో 22 మండలాలోని 316 గ్రామాల్లో 19,313 ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతినగా 19,169 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథ మిక అంచనా వేశారు. వరి 9,863, పత్తి 9,350, సోయా బీన్‌ 160, చెరుకు 40 ఎకరాలలో దెబ్బతిన్నాయి. పంట ల నష్టాల లెక్కలను వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 

దిగుబడి రాని సన్నాలు

 నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో లక్షల ఎకరాలలో వరి పంటను రైతులు సాగుచేస్తుంటారు. ప్రతి ఏటా ఎ క్కువ మొత్తం దొడ్డురకం వరికే ప్రాధాన్యత ఇస్తుంటా రు. అయితే ప్రభుత్వం నియంత్రిత సాగువల్ల సన్నాలనే సాగుచేయాలని సూచించడంతో రైతులు ఉమ్మడి జిల్లా లో సుమారు 4 లక్షల ఎకరాలకుపైగా సన్నాలనే సాగు చేశారు. ఓ వైపు అకాల వర్షాలు సన్నాలకు దెబ్బతినగా మరో వైపు చీడపీడలతో చేతికొచ్చిన పంట కాస్తా అగ్గి పాలేంది. దోమపోటు సన్నాలను కాటువేయడంతో పం ట చేన్లలోనే రైతులు నిప్పటించి నిరసన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అధిగమించి రైతులు పంటను కోసినప్పటి కీ ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎకరానికి 25 క్విం టాళ్లు కూడా రాకపోవడంతో పెట్టుబడి కూడా రాలేదని రైతు లు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కు సన్నధాన్యం రంగుమారడం, తేమ కొరివితో కొనుగోలు కేంద్రాల లోనూ మద్దతు దొరకడం లేదు. దీంతో రైతులకు అప్పులే మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై పరిహారం చెల్లింపు విషయంపై ఎలాంటి స్పందన లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం వల్ల, చీడపీడలతో దిగుబడి రాకపోవడంతో ప్రభుత్వమే ్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పంటనష్ట పరిహారంపైనే ఆశలు

భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాలలో పంటలు దెబ్బతినడమే కాకుండా వేలమంది రైతు లు తీవ్రంగా నష్టపోయి అప్పులపాలయ్యారు. దీం తో పంట నష్టపరిహారంపైనే ఉమ్మడి జిల్లాలోని నష్టపోయిన రైతులు ఆశలు పెట్టుకుంటున్నా రు. ప్రభుత్వం పంట రుణాలు, రైతుబం ధు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్న ప్పటికీ అవి పంటల సాగు సమయంలో ఖర్చులకే పోతున్నాయి. గడిచిన వానాకా లం సీజన్‌లో విస్తారంగా పంటలను రైతు లు కోటి ఆశలతో సాగుచేశారు. పంట సా గును బట్టి మంచి దిగుబడి వస్తాయని ఆశిం చారు. సరిగ్గా చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలతో నష్టపోవడమే కాకుండా దిగుబడు లు తగ్గాయి. ఒక్కో రైతుకు ఎకరానికి సు మారు 10 వేల వరకు అప్పు అయినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. ప్రభు త్వమే నష్టపరమిచ్చి ఆదుకోవాల ని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-01-24T04:57:04+05:30 IST