Abn logo
Oct 23 2020 @ 11:37AM

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై జాయింట్ కమిటీ భేటీ ఈ నెల 28న

Kaakateeya

న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, 2019పై ఏర్పాటైన పార్లమెంటు జాయింట్ కమిటీ ఈ నెలాఖర్లో భేటీ కాబోతోంది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబరులో ఏర్పాటైంది. ఈ కమిటీ సమక్షంలో ట్విటర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, పేటీఎం, గూగుల్ ప్రతినిథులు హాజరై, మౌఖిక స్టేట్‌మెంట్లు ఇస్తారు. 


వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, 2019పై గత ఏడాది డిసెంబరులో ఏర్పాటైన పార్లమెంటు జాయింట్ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో భేటీ అవుతుందని, ఈ కమిటీ సభ్యులకు జారీ చేసిన నోటీసుల ప్రకారం తెలుస్తోంది. ఈ కమిటీ సమక్షంలో ఈ నెల 28న ట్విటర్, అమెజాన్ వెబ్ సర్వీస్ప్రతినిథులు హాజరై, తమ స్టేట్‌మెంట్లను ఇస్తారు. పేటీఎం, గూగుల్ ప్రతినిథులు ఈ నెల 29న హాజరై, తమ స్టేట్‌మెంట్లను ఇస్తారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసు జారీ చేసింది. 


ఈ కమిటీ సమావేశం పార్లమెంటు హౌస్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని ఈ కమిటీ సభ్యులను కోరారు. మీనాక్షి లేఖి, ఎస్ఎస్ అహ్లూవాలియా, పీపీ చౌదరి, రాజీవ్ చంద్రశేఖర్, డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 


Advertisement
Advertisement