Abn logo
Oct 2 2020 @ 03:13AM

గ్రామ సచివాలయాల్లో సత్వర సేవలు

రాజానగరం, అక్టోబరు 1: సంక్షేమ, అభివృద్ధి పథకా లను ప్రజలకు సత్వరం అందించేందుకే ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసిందని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజానగరంలోని మూడు సచివాలయాలను సందర్శించి ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, తహశీల్దారు జి.బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో ఎన్వీవీఎస్‌ మూర్తి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement