ఆగని దోపిడీ

ABN , First Publish Date - 2020-12-05T06:37:23+05:30 IST

ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నా దోపిడీ కొనసాగుతూనే ఉంది. జిల్లా ఉన్నతాధికారులు సీరి యస్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నా ఈ దోపిడీ ఆగడం లేదు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నాలుగైదు ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను జేసీ సిరి తనిఖీ చేసినప్పుడు పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతో రోగుల నుంచి అదనపు డబ్బు వసూలు చేసినట్లు బయటపడింది.

ఆగని దోపిడీ
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతున్న జేసీ డాక్టర్‌ సిరి

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 

రోగుల నుంచి డబ్బు వసూలు

జేసీ సిరి తనిఖీల్లో వెల్లడి

అమరావతి, దివ్యశ్రీ యాజమాన్యాలపై ఆగ్రహం

తీరు మారకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక

అనంతపురం వైద్యం, డిసెంబరు 4: ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నా దోపిడీ కొనసాగుతూనే ఉంది. జిల్లా ఉన్నతాధికారులు సీరి యస్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నా ఈ దోపిడీ ఆగడం లేదు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నాలుగైదు ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను జేసీ సిరి తనిఖీ చేసినప్పుడు పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతో రోగుల నుంచి అదనపు డబ్బు వసూలు చేసినట్లు బయటపడింది. ఆ సమయంలో సీరియ్‌సగా హెచ్చరికలు జారీ చేసి వసూలు చేసిన డబ్బును అక్కడికక్కడే రోగులకు ఇప్పించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అమరావతి, దివ్యశ్రీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ ఆసుపత్రులను జేసీ డాక్టర్‌ సిరి తనిఖీలు చేశారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు ఆస్పత్రుల యాజమాన్యాలు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు.  మీ నుంచి ఫీజు తీసుకున్నారా అని ఆరా తీయగా బాధితులు పరీక్షలు, స్కానింగ్‌ల కోసం డబ్బు తీసుకున్నారని జేసీకి తెలిపారు. దీంతో ఆ యాజమాన్యాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నా రో వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. పైసా తీసు కోకూడదని చెబుతు న్నా పరీక్షల పేరుతో ఎందుకు వసూ లు చేస్తున్నారని మండి పడ్డారు. ఆరోగ్య మిత్రలు ఏం చేస్తున్నారని ఇలా అయితే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆరో గ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలన్నారు. ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నా అమాయక రోగుల నుంచి యాజమన్యాలు డబ్బులు తీసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Updated Date - 2020-12-05T06:37:23+05:30 IST