టీడీపీలోకి చేరికలు

ABN , First Publish Date - 2022-08-10T05:35:35+05:30 IST

మండలపరిధిలోని దుగినేపల్లి గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో గ్రామానికి చెందిన దాదాపు 50కుటుంబాలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.

టీడీపీలోకి చేరికలు
టీడీపీలోకి చేరిన దుగినేపల్లి వాసులతో కందికుంట వెంకటప్రసాద్‌

తనకల్లు, ఆగస్టు 9: మండలపరిధిలోని దుగినేపల్లి గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో గ్రామానికి చెందిన దాదాపు 50కుటుంబాలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆగ్రామానికి చెందిన నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కన్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. కందికుంట వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. తాము గత ఎన్నికల్లో పొరపాటు చేశామని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ను అత్యధిక మోజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని టీడీపీలో చేరినవారు తెలిపారు. ఈసందర్భంగా కందికుంట మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి రాజధాని ఉండేదన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు రాఽజధాని ఏదోకూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన వికృత చేష్టలపై మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దుల క్రిష్ణమూర్తి, సీని యర్‌ నాయకులు బడా రాజారెడ్డి, బీగం శంకర్‌నాయుడు, దేశాయి ప్రభాకర్‌రెడ్డి, మైనార్టీ దస్తగిరి, ఫక్కీర్‌సాబ్‌, షాహీర్‌, తెలుగుయువత అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌, మంజునాథ్‌, మల్లికార్జున, మధుకర్‌నాయుడు, సోంపాళ్యం నాగభూషణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఆ పిల్లలను చదివిస్తా: కందికుంట

తనకల్లు: మండలపరిధిలోని గణాధివారి పల్లికి చెందిన రమణ యేడాది క్రితం ఇంటిలో నిద్రిస్తుండగా, పాముకాటుకు గురై మృతిచెందాడు. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి కందికుంట వెంక టప్రసాద్‌ మంగళవారం మృతుడి ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుడి పిల్లలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ విద్యాలయంలో చేర్పించి చదివిస్తానన్నారు. అలాగే పరాకువాండ్లపల్లిలో మాజీ కన్వీనర్‌ మునెప్ప ఆరోగ్యంతో చికిత్సలు పొందుతుండగా, అతడి ఇంటికెళ్లి పరామర్శించారు. ఎలాంటి సహాయమైనా చేస్తానని హామీ ఇచ్చారు. అదే గ్రామంలో  టీడీపీ కార్యకర్త రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతుండగా పరా మర్శించి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు దస్తగిరి, మండల కార్యదర్శి నాగేంద్రప్రసాద్‌, నాయకులు, నల్లం మాధవరెడ్డి, మహబూబ్‌బాషా, సోంపాళ్యం నాగభూషణం, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:35:35+05:30 IST