‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-02-25T07:07:48+05:30 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌.. క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా ఔషధ

‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ వ్యాక్సిన్‌

న్యూడిల్లీ, ఫిబ్రవరి 24: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌.. క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఇది 72 శాతం సామర్థ్యాన్ని చూపుతోందని పేర్కొంది.


ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని తెలిపింది.  44 వేల మందిపై ప్రయోగించిన అనంతరం వ్యాక్సిన్‌ 66 శాతం ప్రభావం చూపుతోందని ఆ సంస్థ ప్రకటించింది.

Updated Date - 2021-02-25T07:07:48+05:30 IST