Abn logo
Apr 10 2020 @ 18:43PM

కరోనాపై జానీ లివర్ సాంగ్.. వైరల్

కరోనాపై సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సాంగ్ ఎంతగా ప్రచారం పొందిందో తెలియంది కాదు. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించి అందరికీ ఈ పాట రీచ్ అయ్యేలా చేశారు. స్వయంగా ప్రధాని మోదీ కూడా ఈ పాటను మెచ్చుకున్నారంటే ఎంతగా ఈ పాట జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ‘చేతులెత్తి మొక్కుతా.. ’నంటూ చౌరస్తా బ్యాండ్ వాళ్లు చేసిన పాట కూడా భీభత్సంగా జనాలని ఆకర్షించింది. ఇలా చాలా పాటలు కరోనాపై వచ్చి అందరినీ అలరించాయి. తాజాగా కామెడీ కింగ్ జానీ లివర్ కరోనాపై పాడిన పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనే స్వయంగా పాడిన ఈ పాట.. కరోనాకే పిచ్చిపట్టించేలా ఉంది.


‘‘కరోనా కరోనా నీకు ఏడుపు మొదలైంది. పరిగెత్తుకుంటూ పోతావు.. నీళ్లు కూడా అడగలేవు. ఇండియాలోకి వచ్చి పెద్ద తప్పు చేశావు. ఇక్కడికి వస్తే నీ అమ్మమ్మ కూడా చచ్చిపోతాది.. ఎందుకంటే ఇది భారతదేశం. మేము ఇంట్లోనే ఉండి నిన్ను పరుగులు పెట్టిస్తాం. నువ్వు బయటే ఉండి కుళ్లిపోతావు. నీ చేతికి దొరకము మేము. నిన్ను అంతమొందించేది మేమే. నీ పీక పిసికేస్తాం.. ఇది భారతదేశం..’’ అంటూ కరోనాకి వార్నింగ్ ఇచ్చే పదాలతో జానీ లివర్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా దూసుకుపోతుంది.


Advertisement
Advertisement
Advertisement