మాలీవుడ్‌లో సినిమాను నిర్మిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో

సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే కొంతమంది నిర్మాతల అవతారమెత్తుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు మాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయనెవరో కాదు యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న జాన్ అబ్రహాం. 


గతంలోనే జాన్ అబ్రహాం బాలీవుడ్‌లో అనేక చిత్రాలను నిర్మించాడు. విక్కీ డోనర్, మద్రాస్ కేఫే, పరమాణు: ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, బాట్లా హౌస్, రాకీ హ్యాండ్సామ్, సర్దార్ కా గ్రాండ్ సన్ వంటి తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. జాన్ అబ్రహాం ఈ మధ్య సత్యమేవజయతే-2 సినిమాలో హీరోగా నటించాడు. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 

‘‘ మైక్ ’’ అనే మలయాళం సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ తాజాగా విడుదల అయింది. ఈ సందర్భంగా కొచ్చిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరంగా హీరో జవాబిచ్చాడు. తన తల్లికి మోహన్ లాల్ అంటే  ఇష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ‘‘మైక్’’ సినిమాలో రంజిత్ సంజీవ్, అనస్వర రాజన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్షయ్ రాధాకృష్ణన్, అభిరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తు‌న్నారు. విష్ణు శివప్రసాద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్ అబ్రహాం ప్రస్తుతం అటాక్, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల్లో నటిస్తున్నాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...