Abn logo
Jan 16 2021 @ 11:08AM

చెయ్యి కాదు.. గూగుల్ మ్యాప్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిట్నెస్ అంటే ప్రాణమిచ్చే జాన్ తాజాగా తన చెయ్యి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. నరాలు తేలిన ఆ చెయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


జాన్ అబ్రహం చెయ్యి గూగుల్ మ్యాప్స్‌ను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా జాన్ ఫొటోపై స్పందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న `సలార్` సినిమాలో జాన్ విలన్ పాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement