హ్యాట్సాఫ్‌ జోగిందర్‌

ABN , First Publish Date - 2020-03-30T09:59:58+05:30 IST

కరోనాపై పోరాటంలో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ హీరో జోగిందర్‌ సింగ్‌పై ఐసీసీ ప్రశంసలు కురిపించింది. 2007 టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌తో ...

హ్యాట్సాఫ్‌ జోగిందర్‌

ఐసీసీ ప్రశంస

న్యూఢిల్లీ:రోనాపై పోరాటంలో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ హీరో జోగిందర్‌ సింగ్‌పై ఐసీసీ ప్రశంసలు కురిపించింది. 2007 టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌తో ఫైనల్లో జోగిందర్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలింగ్‌తో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. రిటైర్మెంట్‌ తర్వాత హరియాణా పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా చేరాడు. ‘విపత్కర పరిస్థితుల్లో ప్రజల శ్రేయస్సు కోసం పోలీసుగా జోగిందర్‌ విధులు నిర్వర్తిస్తున్నాడ’ని ఐసీసీ ట్వీట్‌ చేసింది. జోగిందర్‌ ఫొటోలను పోస్టు చేసింది. 36 ఏళ్ల జోగిందర్‌ టీమిండియా తరఫున నాలుగేసి వన్డేలు, టీ20లు ఆడాడు. 

Updated Date - 2020-03-30T09:59:58+05:30 IST