గేల్‌ను 99 పరుగుల వద్ద ఔట్ చేస్తానని ముందే చెప్పిన అర్చర్

ABN , First Publish Date - 2020-11-01T01:06:50+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ 99 పరుగుల వద్ద

గేల్‌ను 99 పరుగుల వద్ద ఔట్ చేస్తానని ముందే చెప్పిన అర్చర్

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ 99 పరుగుల వద్ద అవుటై సెంచరీ చేజార్జుకున్నాడు. అర్చర్ బౌలింగులో ముందు బంతిని సిక్సర్ కొట్టిన గేల్.. తర్వాత బంతిని అంచనా వేయడంలో తడబడి బౌల్డయ్యాడు. అయితే, ఈ అవుట్‌ను అర్చర్ ఎప్పుడో 2013లోనే ఊహించాడట. గేల్ అవుట్ తర్వాత అప్పట్లో అర్చర్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అర్చర్ ఇలా ముందే ఊహించి చేసిన ట్వీట్లు గతంలోనూ వైరల్ అయ్యాయి. దీంతో అతడిని క్రికెట్ నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు.


ఇక, 2013లో చేసిన ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘నాకు తెలుసు. నేను కనుక బౌలింగ్ చేస్తే అతడు 100 పరుగులు చేయలేడు’ అని 22 ఫిబ్రవరి 2013న అర్చర్ ట్వీట్ చేశాడు. గేల్‌ను అవుట్ చేస్తానన్న విషయం గేల్‌కు ముందే తెలుసంటూ నెటిజన్లు అతడి ట్వీట్‌ను ఇప్పుడు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అర్చర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా దానిని రీట్వీట్ చేస్తూ ‘‘100%’’ అని రాసుకొచ్చింది.

Updated Date - 2020-11-01T01:06:50+05:30 IST