సునీల్ గవాస్కర్ ఆల్ టైమ్ టెస్ట్ రన్స్ రికార్డును అధిగమించిన జో రూట్

ABN , First Publish Date - 2022-06-15T01:20:20+05:30 IST

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. నిలకడగా రాణిస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు

సునీల్ గవాస్కర్ ఆల్ టైమ్ టెస్ట్ రన్స్ రికార్డును అధిగమించిన జో రూట్

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. నిలకడగా రాణిస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రస్తుత టెస్టు ఆటగాళ్లలో మొనగాడినని అనిపించుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రూట్.. మరో రికార్డును బద్దలుగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను అధిగమించాడు. 119 మ్యాచుల్లో 10,191 పరుగులు చేసిన రూట్.. సన్నీ (10,122), పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్ (10,099)లను ఓవర్ టేక్ చేసి సచిన్ రికార్డుపై కన్నేశాడు. 


అయితే, టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేయగలడా?  అన్న చర్చ జరుగుతోంది.  మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో 15,921 పరుగులు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్ తిరుగులేని పొజిషన్‌లో ఉన్నాడు. ఈ రికార్డ్‌ను  రూట్ అధిగమించడం  కష్టమే అని మాజీలు అంటున్నారు. ప్రస్తుతం రూట్ వయసు 31 సంవత్సరాలు. మాస్టర్‌ను ఓవర్ టేక్ చేయాలంటే దాదాపుగా మరో ఆరు వేల పరుగులు చేయాలి. ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో 8 వందల నుంచి వెయ్యి పరుగులు సాధించాలి. ఒక వేళ అలా సాధించినా సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకకు మరో ఎనిమిదేళ్లయినా పడుతుంది. అయితే, అన్నేళ్లపాటు అతడు క్రికెట్‌లో కొనసాగడం కష్టమేనని అంటున్నారు. కాబట్టి సచిన్ రికార్డు గురించి రూట్ మర్చిపోతే మంచిదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.  

Updated Date - 2022-06-15T01:20:20+05:30 IST