Sachin రికార్డులను బద్దలుగొట్టే సత్తా Rootకి ఉంది: వసీం జాఫర్

ABN , First Publish Date - 2022-07-07T23:25:56+05:30 IST

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ గత కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో

Sachin రికార్డులను బద్దలుగొట్టే సత్తా Rootకి ఉంది: వసీం జాఫర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) గత కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 142 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత అందుకున్నాడు. ఫలితంగా కోహ్లీ (Virat Kohli) రికార్డు బద్దలైంది. 31 ఏళ్ల రూట్ ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో 105.28 సగటుతో 737 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి అత్యధిక స్కోరు 180 నాటౌట్. 


రూట్ అద్భుత ఫామ్‌పై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్(wasim Jaffer)  కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును రూట్ బద్దలుగొట్టడం ఖాయమని అన్నాడు. ‘ఈఎస్‌పీఎన్‌’ మాట్లాడుతూ జాఫర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రూట్ కనుక మరో ఐదారేళ్లపాటు క్రికెట్ ఆడితే టెండూల్కర్ రికార్డును అధిగమించడం ఖాయమని జోస్యం చెప్పాడు.

Updated Date - 2022-07-07T23:25:56+05:30 IST