Green Card ల జారీ వేగవంతం?.. భారతీయ నిపుణులకు ఉపశమనం!

ABN , First Publish Date - 2021-10-10T12:50:31+05:30 IST

గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో మంది భారతీయ వృత్తి నిపుణులకు ఊరట లభించనుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో జాప్యాన్ని నివారించాలని కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అత్యంత నిపుణులైన భారతీయ టెకీలు హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వస్తారు.

Green Card ల జారీ వేగవంతం?.. భారతీయ నిపుణులకు ఉపశమనం!

జాప్యాలను పరిష్కరించాలన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో మంది భారతీయ వృత్తి నిపుణులకు ఊరట లభించనుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో జాప్యాన్ని నివారించాలని కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అత్యంత నిపుణులైన భారతీయ టెకీలు హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వస్తారు. ఒక్కో దేశానికి 7ు చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్న ప్రస్తుత అమెరికా వలస విధానంతో వీరు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ గ్రీన్‌కార్డుల అంశంపై దృష్టి సారించారు.


‘‘గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఆలస్యాన్ని పరిష్కరించాలని అధ్యక్షుడు బైడెన్‌ గట్టిగా కోరుకుంటున్నారు’’ అని శ్వేతసౌధం ప్రెస్‌ కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు. ఓ వైపు లక్షలాది మంది గ్రీన్‌కార్డుల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తుండగా.. మరోవైపు 80 వేల ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులు వృథా అవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయం వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ సభ్యురాలు మారియానెట్‌ మిల్లర్‌- మీక్స్‌ ఉద్యోగ వీసాల సంరక్షణ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉపయోగించని ఉద్యోగ ఆధారిత వీసాలను 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాడుకునేందుకు వీలు కలగనుంది. 

Updated Date - 2021-10-10T12:50:31+05:30 IST