ఆ వీసాలపై బ్యాన్‌ను ఎత్తివేయండి.. బైడెన్‌కు సెనేటర్ల లేఖ

ABN , First Publish Date - 2021-03-19T18:53:37+05:30 IST

భారతీయ ఐటీ నిపుణులు అత్యధికంగా లబ్ధిపొందే హెచ్​-1బీతో పాటు ఇతర నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఐదుగురు డెమొక్రటిక్ పార్టీ సెనెనేటర్లు గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు లేఖ రాశారు.

ఆ వీసాలపై బ్యాన్‌ను ఎత్తివేయండి.. బైడెన్‌కు సెనేటర్ల లేఖ

వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులు అత్యధికంగా లబ్ధిపొందే హెచ్​-1బీతో పాటు ఇతర నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఐదుగురు డెమొక్రటిక్ పార్టీ సెనెనేటర్లు గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు లేఖ రాశారు. ఈ బ్యాన్ వల్ల అమెరికా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అలాగే విదేశీ నిపుణులు, వారి ఫ్యామిలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సెనేటర్లు తమ లేఖలో పేర్కొన్నారు. కనుక పరిస్థితి చేయి దాటకముందే తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని వారు సూచించారు. ప్రస్తుతం దేశ ఐటీ కంపెనీల్లో ఏర్పడిన ఉద్యోగుల కొరతను తీర్చేందుకు వెంటనే విదేశీ టెకీలను నియమించుకునే అవకాశం ఇవ్వాలని సెనేటర్లు కోరారు. 


ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 2020 జూన్​లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాన్​ ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ, ఎల్​-1, హెచ్​-2బీ, జే-1 జారీపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదట 2020 డిసెంబర్​ 31వరకు విధించిన ఈ నిషేధాన్ని.. ట్రంప్ తాను పదవిలోంచి దిగిపోయే కొన్ని రోజుల ముందు 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అమెరికన్ కంపెనీలకు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పించేది హెచ్-1బీ వీసా. దీని ద్వారా యూఎస్ ఐటీ కంపెనీలు ప్రతియేటా భారత్, చైనా వంటి దేశాల నుండి వేలాది మంది ఐటీ, ఇతర ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

Updated Date - 2021-03-19T18:53:37+05:30 IST