పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారిపడి జో బిడెన్‌కు గాయాలు

ABN , First Publish Date - 2020-11-30T11:25:08+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడి గాయపడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ....

పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారిపడి జో బిడెన్‌కు గాయాలు

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడి గాయపడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. జోబిడెన్ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాగిలంతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బిడెన్ డెలావేర్ లోని ఆర్థోపెడిక్ డాక్టరును కలిసి చికిత్స తీసుకున్నారని బిడెన్ కార్యాలయం వెల్లడించింది. జో బిడెన్ రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అందులో 2018లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా జారి పడి గాయపడ్డారు.బిడెన్ 2008లో ఒక కుక్కను దత్తత తీసుకున్నారు. బిడెన్ తో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్ హౌస్ కు రానున్నాయి.

Updated Date - 2020-11-30T11:25:08+05:30 IST