యూఎస్ సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి!

ABN , First Publish Date - 2020-12-04T23:41:07+05:30 IST

భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి మరోసారి కీలక పదవిని చేపట్టబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వివేక్ మూర్తి.. యూనైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్‌గా మ

యూఎస్ సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి!

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి మరోసారి కీలక పదవిని చేపట్టబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వివేక్ మూర్తి.. యూనైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్‌గా మరోసారి విధులు నిర్వర్తించనున్నారు. అమెరికా తదుపరి సర్జన్ జనరల్‌గా జో బైడెన్ వివేక్ మూర్తిని నియమించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన అతి త్వరలో రాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా.. వివేక్ మూర్తి ప్రస్తుతం జో బైడెన్‌కు కొవిడ్ 19 ముఖ్య సలహాదారుగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వివేక్ మూర్తి ఒబామా ప్రభుత్వంలో యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. 2014 డిసెంబర్ 15 నుంచి 2017 ఏప్రిల్ 21 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. కాగా.. ప్రస్తుతంయునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్‌గా జెరోమ్ ఆడమ్స్ పని చేస్తున్నారు. 


Updated Date - 2020-12-04T23:41:07+05:30 IST