Abn logo
Jan 19 2021 @ 07:30AM

బైడెన్‌ బృందంలో తెలుగు వ్యక్తి !

హుజూరాబాద్‌, జనవరి 18: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు స్పీచ్‌రైటింగ్‌ డైరెక్టర్‌గా నియమితులవడం పట్ల ఆ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. వినయ్‌రెడ్డి తండ్రి  నారాయణరెడ్డి పోతిరెడ్డిపేటలోనేచదువుకున్నారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్‌ కావడంతో  40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వినయ్‌రెడ్డి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ గ్రామంలో  ఆయనకు మూడెకరాల పొలం, ఇల్లు ఉంది. వినయ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుంటారని గ్రామస్థులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement