భారత ఐటీ నిపుణులకు తీపి కబురు..!

ABN , First Publish Date - 2020-07-03T05:14:06+05:30 IST

అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్.. భారత ఐటీ నిపుణులకు తీపి కబురు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా

భారత ఐటీ నిపుణులకు తీపి కబురు..!

వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్.. భారత ఐటీ నిపుణులకు తీపి కబురు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిని మళ్లీ చేజిక్కించుకోవడానికి ట్రంప్.. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోవడంతో.. వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా హెచ్1బీ సహా ఇతర ఉపాధి ఆధారిత వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు సస్పెండ్ చేశారు. తద్వారా అమెరికన్ల ఓట్లు పొందాలని భావించారు. కాగా.. ఇండియన్-అమెరికన్ల ఓటర్లపై గురిపెట్టిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ మాత్రం భారత ఐటీ నిపుణులకు తీపి కబురు చెప్పారు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందితే.. హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో హెచ్1బీ వీసాదారులు కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ విధానాలను క్రూరమైనవిగా అభివర్ణించిన బిడెన్.. తాను అధికారంలోకి వస్తే వైవిధ్యమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-07-03T05:14:06+05:30 IST