అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ ఖరారు

ABN , First Publish Date - 2020-06-07T07:39:01+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ ఖరారు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ ఖరారయ్యారు. ఆయన అభ్యర్థిత్వానికి కావాల్సిన 1991 ప్రతినిధుల మద్దతును ఆయన సంపాదించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించి ఆయనకు కావాల్సిన మద్దతును కూడగట్టుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో జో బైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ పార్టీ‌ నుంచి అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులతో పోటీ చేయడం గౌరవంగా ఉందన్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ మొత్తం ఐక్యమత్యంగా ముందుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. ‘అమెరికా చరిత్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. మరోపక్క అధ్యక్షుడు ట్రంప్ కోపానికి, విభజన రాజకీయాలకు సమాధానం లేదు. అమెరికన్లు మంచి నాయకత్వం కోసం ఎదరుచూస్తున్నారు. తిరిగి అమెరికన్లను ఒక్కచోటికి చేర్చి కలిసి జీవించే విధమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికన్లు తాము భరిస్తున్న నొప్పిని నయం చేసే నాయకుడి కోసం వేచిచూస్తున్నారు’ అని జో బైడెన్ అన్నారు. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.  

Updated Date - 2020-06-07T07:39:01+05:30 IST