ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడానికి తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడిపై విమర్శలు..

ABN , First Publish Date - 2022-07-27T05:22:34+05:30 IST

అమెరికాలో పెట్రోల్ ధరల తగ్గడానికి తానే కారణమని చెప్పేందుకు ప్రయత్నించి అధ్యక్షుడు బైడెన్ భంగ పడ్డారు.

ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడానికి తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడిపై విమర్శలు..

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఇంధన ధరల(gas prices) తగ్గడానికి తానే కారణమని చెప్పేందుకు ప్రయత్నించి అధ్యక్షుడు బైడెన్(Joe biden) భంగ పడ్డారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పెట్రోల్ ధరలు కొద్దిగా తగ్గిన విషయాన్ని బైడెన్ తన తాజా ట్వీట్‌లో ప్రస్తావించారు. జూన్ 14 గరిష్టంగా ఒక గ్యాలన్ ఇంధన ధర 5.01 డాలర్లకు చేరుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుతం 4.35 డాలర్లు చేరుకున్న ధరల కారణంగా ఒక్కో అమెరికన్ నెలకు 35 డాలర్ల వరకూ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ధరలు అదే స్థాయిలో ఉండి ఉంటే ప్రజలపై భారం పడేదంటూ కామెంట్ చేశారు. తద్వారా ధరలు తగ్గడానికి తానే కారణమని పరోక్షంగా తెలిపారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఇంధన ధర ఇప్పటి ధరలో సగం ఉండేదన్న విషయాన్ని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2021 జనవరిలో అమెరికాలో గ్యాలన్ 2.37 డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-27T05:22:34+05:30 IST