అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు ఓటమి తప్పదా..!

ABN , First Publish Date - 2020-09-28T02:27:09+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 36 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు.. తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. అ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు ఓటమి తప్పదా..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 36 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు.. తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. అమెరికన్లు ఎవరివైపు ఉన్నారనే విషయాన్ని ఆ ఫలితాలు తేల్చేశాయి. ఎక్కువ మంది అమెరికన్లు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కే జై కొట్టినట్టు వివరించాయి. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థలు.. వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నేషనల్ సర్వే నిర్వహించి వాటికి సంబంధించిన ఫలితాలను తాజాగా వెల్లడించాయి. 10 శాతం పాయింట్లతో జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా.. జో బైడెన్, కమలా హారిస్‌కు 54 శాతం మంది అమెరికన్లు మద్దతు తెలిపిదే.. డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌కు 44శాతం మంది మాత్రమే బాసటగా నిలిచారని  వాషింగ్టన్ పోస్ట్ పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించన మరో సర్వేలో కూడా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. ఎనిమిది పాయింట్లతో ట్రంప్ కంటే ముందున్నారని తేలింది. కాగా.. ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు అమెరికాలో చర్చనీయాంశం అయ్యాయి. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2020-09-28T02:27:09+05:30 IST