ఏపీ నుంచి మరో పరిశ్రమ ఔట్

ABN , First Publish Date - 2020-09-17T02:31:12+05:30 IST

ఆ జిల్లాలో వలసలను కట్టడి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చారు..

ఏపీ నుంచి మరో పరిశ్రమ ఔట్

ఆ జిల్లాలో వలసలను కట్టడి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చారు. దాని ఏర్పాటుకు కావాల్సిన భూమి ఇతర మౌలిక సదుపాయాలను ఆగమేఘాలపై కల్పించారు. అలాంటి పరిశ్రమ రాష్ట్రంలో అధికార మార్పిడితో ఉన్నపళంగా తిరుగు టపా కట్టింది. ఇంతకీ ఆ పరిశ్రమ తరలిపోవడానికి కారకులు ఎవరు?.ఈ తతంగం ఏ జిల్లాలో జరిగింది. 


అనంతపురం జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది కరువు. ఈ జిల్లా వాసుల్లో చాలా మంది పని లేక ఉపాధి కోసం పోరుగు రాష్ట్రాలకు పొట్ట చేత్తో పట్టుకుని వలసలు వెళుతూ ఉంటారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపై టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలోనే కార్ల తయారీలో దిగ్గజ పరిశ్రమ అయిన కియాను జిల్లాకు తీసుకొచ్చింది. పెనుకొండ నియోజకవర్గం అమ్మవారిపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు భరోసా కల్పించింది.




Updated Date - 2020-09-17T02:31:12+05:30 IST