Abn logo
Oct 15 2021 @ 01:25AM

మీ దయతో ఉద్యోగాలు గల్లంతు: లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ దయవల్ల దాదాపు 2,000మంది ఉద్యోగులను 20 నెలల పాటు జీతం కూడా ఇవ్వకుండా తొలగించేశారు. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ నుంచి తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’’ అని తెలుగుదేశం జాతీయ ప్రఽధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. ‘‘మీరిచ్చిన హామీలను గుర్తుచేసేందుకు ఇలా లేఖలు రాయాల్సి రావడం విచారకరం. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నేనున్నానని అన్నారు. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఉద్యోగులు మీరు అధికారంలోకి రాగానే హామీ నెరవేరుతుందని అనుకున్నారు. కానీ మీ బులుగు కార్యకర్తలను కొలువుల్లో కూర్చోబెట్టేందుకు, మీ నేతలు అమ్ముకునేందుకు వీలుగా... ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వాళ్లను తీసేశారు. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 14 నెలల జీతాలు, అంతకుముందు ఏజన్సీల నుంచి ఆరునెలల జీతాలు ఇవ్వకుండా తొలగించడంతో ఆ ఉద్యోగులంతా కుటుంబాలతో సహా రోడ్డునపడ్డారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.  

క్రైమ్ మరిన్ని...