ఉద్యోగాల ప్రకటన ఎన్నికల స్టంట్‌: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-03-10T23:49:06+05:30 IST

ఉద్యోగ ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన కేవలం ఎన్నికల స్టంట్‌ మాత్రమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

ఉద్యోగాల ప్రకటన ఎన్నికల స్టంట్‌: కోమటిరెడ్డి

నార్కట్‌పల్లి: ఉద్యోగ ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన కేవలం ఎన్నికల స్టంట్‌ మాత్రమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు అసెంబ్లీలో కేసీఆర్‌ చెప్పిన కపట మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. నిరుద్యోగులపై  కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఎందుకు వేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. హఠాత్తుగా నిరుద్యోగులపై ప్రేమ చూపించడం వెనుక ముందస్తు ఎన్నికల యోచనే కారణమన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్నట్లు తను చేయించిన సర్వేలో స్పష్టమైనందునే దిద్దుబాటు చర్యల్లో భాగంగానే కొత్త నాటకాలకు సీఎం తెరలేపుతున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2022-03-10T23:49:06+05:30 IST