Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన

twitter-iconwatsapp-iconfb-icon
 ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనగిద్దలూరులో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

గిద్దలూరు, జనవరి 26 :  పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయు లు నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో హోం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి జరుగుతున్న అన్యాయంపై డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ విగ్రహానికి మెమొరాండం అందచేశారు. పీఆర్సీ వేతన సమితి చైర్మన్‌ టి.నరేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం గా రావలసిన, చెందాల్సిన 11వ వేతన సవరణను తక్కువగా ప్రకటించడం, ఐదేళ్లకోసారి కాకుండా పదేళ్లకు పెంచుతామని ప్రకటించ డం శోచనీయమన్నారు. సకాలంలో కరువు భ త్యం ఇవ్వడం లేదని, ఇంటి అద్దె అలవెన్స్‌లలో కోత పెట్టారని ధ్వజమెత్తారు. సీపీఎస్‌ రద్దు చేయకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్‌ చేయకపోవడం, పింఛనర్లకు అదనపు పిం ఛన్‌ మరో పదేళ్లకు పెంచడం లాంటి డిమాండ్లను సాధించే వరకూ ఉద్యమం ఆగదని పే ర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్సీ సాధన స మితి గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.సూరిబాబు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వైపీ రంగయ్య,  పింఛనర్ల సంఘం అధ్యక్షుడు జి.రవీంద్రనాథ్‌రెడ్డి, యూటీఎఫ్‌ నాయకులు రంగారెడ్డి,  ఏపీటీఎఫ్‌ నాయకులు యల్లా శ్రీనివాసు లు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకు లు చక్రపాణి, విజయరత్నం, నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ నాయకులు రమేష్‌రెడ్డి, కార్మిక, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

జగన్‌కు బుద్ధి రావాలి

కంభం : జగన్‌కు బుద్ధిని ప్రసాదిం చాలని కోరుతూ కంభం మండల జా యింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు నల్లబ్యాడ్జీలతో ఎంఈవో కార్యాలయం నుంచి కందులాపురం సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పీఆర్సీ సాధన క మిటీ నాయకులు ఇబ్రహీం,   జేఏసీ చైర్మన్‌ రాధాకృష్ణమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. అనం తరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. 

అంబేడ్కర్‌కు వినతి

మార్కాపురం(వన్‌టౌన్‌) :  పీఆర్సీ సాధన సమితి  మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగు లకు న్యాయంగా రావాల్సిన రాయితీ లన్నీ ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటిం చిన పీఆర్సీని రద్దు చేయాలని అన్నా రు. కార్యక్రమంలో సాధన సమితి నాయకులు ఆర్‌.నాగేంద్రరెడ్డి, ఎం.రవి చంద్రబాబు, కె.ఝాన్సీపాల్‌, కె.చంచి రెడ్డి, కె.చంద్రశేఖర్‌,  వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, టి.శ్రీనివాస రావు, ఎం.మోహన్‌ రాజు, వద్దుల వీరారెడ్డి పాల్గొన్నారు.  

పొదిలి రూరల్‌లో..

పొదిలి (రూరల్‌) : సాధన కమిటీ ఆధ్వ ర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్ర హానికి వినతిపత్రం అందజేశారు. పొదిలి తాలూక పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యా యులు,  పిం ఛనర్లు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగు లు  ఏబీఎం కాంపౌండ్‌ ఆవరణలోని అంబే డ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టి అనంతరం వితిపత్రాన్ని సమర్పించారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత  పింఛన్‌, హెచ్‌ఆర్‌ ను కొనసాగిం చాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. కార్యక్ర మంలో యూ టీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ హై, రమణారెడ్డి, బాల కాశి రెడ్డి, నాగార్జున, కోటే శ్వరరావు, ఎన్జీవో ప్రధా న కార్యదర్శి ఎస్‌కే రఫీ నాగూర్‌వలి, సందాని బాషా, జిందేషా మ దార్‌వలి,  ఏపీటీఎఫ్‌ నారాయణ, కోటేశ్వర రావు, ఖాజావలి, శ్రీని వాసులు, పెన్షనర్‌ అసోసియోషన్‌  బాదుల్లా, గుంటూరి వీరబ్ర హ్మం, మదార్‌వలి,  నరసింహశాస్ర్తీ, ఏ వీరా రెడ్డి, కాంట్రాక్టర్‌  ఎంప్లాయీస్‌ నుంచి  ఆది లక్ష్మీ,  పద్మ, రెవె న్యూ కిలారి సుబ్బారావు,  అ బ్దుల్‌ రెహమాన్‌, ట్రెజరీ  కరిముల్లా, అంగ న్వాడీ శోభ,  ఆర్టీసీ  శేషకుమార్‌, రామకృష్ణ, బీటీఏ శ్రీనివాసులు  పాల్గొన్నారు.

ఈ పీఆర్సీ మాకొద్దు

ఎర్రగొండపాలెం :  ఈ పీఆర్సీ మాకొద్దు అంటూ, ఆ జీవో రద్దు  చేయాలని ఎర్రగొండపాలెం తాలూకా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఫ్యాప్టో  ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎ న్జీవో నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో  ఫ్యాప్టో అధ్యక్షుడు నాగ య్య, సాధన కమిటీ నాయకులు శ్యాంరాజు, రవి, బాబులానాయక్‌, వెంకటేశ్వరనాయక్‌, ఎ న్జీవో అధ్యక్షుడు చేదూరి రవికుమార్‌, షేక్‌  జా నీబాషా, శ్రీనివాసరావు, సుబాని, విశ్రాంత ఉ ద్యోగుల సంఘం అధ్యక్షుడు బాదరయ్య తది తరులు పాల్గొన్నారు. 

సమస్యలను పరిష్కరించాలి

పుల్లలచెరువ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, కార్మికులు, పింఛనర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీ సాధన కమిటీ నాయకులు డా అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో  కమిటీ సభ్యులు దేసింగ్‌రాజు, పూర్ణయ్య, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

చీకటి జీవోలు రద్దు చేయాలి

పెద్దదోర్నాల : ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్‌ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.గణతంత్ర దినోత్సవం సంధర్భంగా రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద యూటీఎఫ్‌ గౌరవాధ్యక్షులు ఎం వర్ధన్‌ అధ్యక్షతన నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. తమ న్యాయమైన సమస్యలు తక్షణ మే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం తప్పదని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.  ప్రభుత్వ చర్యలపై నినాదాలు చేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.