ఆదివాసీలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-05-06T04:34:25+05:30 IST

ఏజెన్సీలోని ఉద్యోగ అవకాశాలు వందశాతం ఆది వాసీలకే కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేస్రం మనోహర్‌, సచిన్‌ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఫిబ్రవరిలో జీవో నెంబర్‌ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఇచ్చిందన్నారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగ అవకాశాలు ఆదివాసీలకు చెందుతాయన్నారు. కోర్టులో న్యాయబద్ధంగా వాదనలు జరుగుతున్నాయని ఆశిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగానికి లోబడే జీవో నెంబర్‌ 3 వచ్చిందని, సుప్రీంకోర్టు దీనిని గ్రహిస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆదివాసీ ఉద్యోగులు, మేధావులు పోరాటానికి కలిసి రావాలని కోరారు.

ఆదివాసీలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, మే 5 : ఏజెన్సీలోని ఉద్యోగ అవకాశాలు వందశాతం ఆది వాసీలకే కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేస్రం మనోహర్‌, సచిన్‌ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఫిబ్రవరిలో జీవో నెంబర్‌ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఇచ్చిందన్నారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగ అవకాశాలు ఆదివాసీలకు చెందుతాయన్నారు. కోర్టులో న్యాయబద్ధంగా వాదనలు జరుగుతున్నాయని ఆశిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగానికి లోబడే జీవో నెంబర్‌ 3 వచ్చిందని, సుప్రీంకోర్టు దీనిని గ్రహిస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆదివాసీ ఉద్యోగులు, మేధావులు పోరాటానికి కలిసి రావాలని కోరారు.

Updated Date - 2021-05-06T04:34:25+05:30 IST