ఐబీఎంలో ఉద్యోగాల కోత

ABN , First Publish Date - 2020-05-24T06:34:22+05:30 IST

టెక్నాలజీ దిగ్గజాలైన హ్యులెట్‌ ప్యాకా ర్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (హెచ్‌పీఈ), ఐబీఎం.. వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కోవిడ్‌-19 ధాటికి వ్యాపారపరంగా సవాళ్లు ఎదుర్కొంటుండటంతో ఉద్యోగాల్లో...

ఐబీఎంలో ఉద్యోగాల కోత

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజాలైన హ్యులెట్‌ ప్యాకా ర్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (హెచ్‌పీఈ), ఐబీఎం.. వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.  కోవిడ్‌-19 ధాటికి వ్యాపారపరంగా సవాళ్లు ఎదుర్కొంటుండటంతో ఉద్యోగాల్లో కోత పెట్టక తప్పని పరిస్థితి ఎదురైందంటూ ప్రవాస భారతీయుడు అర్వింద్‌ కృష్ణ సారథ్యంలోని ఐబీఎం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న సంక్లిష్ఠ పరిస్థితుల్లో కంపెనీ వ్యాపార వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.  కాగా ఉద్యోగుల తొలగింపు భారత్‌లో కూడా ఉండవచ్చని అంచనా. మరోవైపు హెచ్‌పీఈ కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపు  ఇటీవలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఉంటుందని ప్రకటించింది.

Updated Date - 2020-05-24T06:34:22+05:30 IST