అక్టోబరు వరకు యూకే ఉద్యోగ రక్షణ పథకం

ABN , First Publish Date - 2020-05-31T08:24:24+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల రక్షణ కోసం తెచ్చిన పథకంలో ఆగస్టు నుంచి మార్పులు చేయనున్నట్టు యూకే చాన్స్‌లర్‌ రిషి సునాక్‌ తెలిపారు. జూలై చివరిదాకా ఈ పథకంలో ఎలాంటి మార్పులు ఉండవని, ఆగస్టు నుంచి మార్పులు జరుగుతూ అక్టోబరులో పథకం...

అక్టోబరు వరకు యూకే ఉద్యోగ రక్షణ పథకం

లండన్‌, మే 30: కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల రక్షణ కోసం తెచ్చిన పథకంలో ఆగస్టు నుంచి మార్పులు చేయనున్నట్టు యూకే చాన్స్‌లర్‌ రిషి సునాక్‌ తెలిపారు. జూలై చివరిదాకా ఈ పథకంలో ఎలాంటి మార్పులు ఉండవని, ఆగస్టు నుంచి మార్పులు జరుగుతూ అక్టోబరులో పథకం ముగుస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం దాదాపు పది లక్షల మంది కార్మికులకు 80 శాతం వేతనాన్ని (2,500 యూరోల వరకు) చెల్లిస్తుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఇది కొనసాగుతుంది. ఈ నెలల్లో ఉద్యోగాన్ని కల్పించిన సంస్థ ఏమీ చెల్లించదు. ఆగస్టు నుంచి సంస్థ ఉపాధి వ్యయంలో 5 శాతం నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఎంప్లాయర్‌ పెన్షన్‌ కంట్రిబ్యూషన్స్‌ కింద భరించాల్సి ఉంటుంది. సెప్టెంబరులో ప్రభుత్వం 70 శాతం చెల్లిస్తే.. ఎంప్లాయర్‌ 10 శాతం, అక్టోబరులో ప్రభుత్వం 60 శాతం, ఎంప్లాయర్‌ 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పథకం ముగియనుంది. 


Updated Date - 2020-05-31T08:24:24+05:30 IST