31న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2022-01-29T06:14:27+05:30 IST

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీ సోమవారం యువత కోసం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.

31న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

విశాఖపట్నం, జనవరి 28: కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీ సోమవారం యువత కోసం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు. పాయకరావుపేటలోని డెక్కన ఫైన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని ట్రైనీ కెమిస్ట్‌, జూనియర్‌ కెమిస్ట్‌తో పాటు మెషిన్‌ ఆపరేటర్స్‌ ఉద్యోగాల భర్తీకి ఇంట ర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. డీ ఫార్మశీ, బీఫార్మశీ, బీఎస్సీ కెమిస్ట్రీతోపాటు మెకానికల్‌ డిప్లొమా, బీటెక్‌ మెకానికల్‌లో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేలు వేతనం ఉంటుందని, ఔత్సాహికులు నేషనల్‌ కెరీర్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని ఆ రోజు ఉదయం 10 గంటలకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సుబ్బిరెడ్డి సూచించారు. 

Updated Date - 2022-01-29T06:14:27+05:30 IST