Abn logo
Sep 19 2020 @ 11:09AM

‘జోకర్’ సీక్వెల్‌కు సన్నాహాలు... జోక్విన్ ఫీనిక్స్‌కు రూ.367 కోట్లు!

Kaakateeya

టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ మూవీ ‘జోకర్’ 2019లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించిన నటుడు జోక్విన్ ఫీనిక్స్ ఇప్పుడు జోకర్ సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జోకర్‌కు సంబంధించిన రెండు సీక్వెల్స్ కోసం జోక్విన్ ఫీనిక్స్ 50 మిలియన్ డాలర్లు అంటే రూ. 367 కోట్లు పారితోషికంగా అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ వాకిన్, డాట్‌లు సూచనప్రాయంగా ఈ విషయాన్ని తెలిపారు. జోక్విన్ ఫీనిక్స్ ఈ సినిమాలోని తన అద్భుత నటనకు గాను అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఆస్కార్-2020లో ఈ సినిమా వివిధ కేటగిరీలలో నామినేట్ అయ్యింది. 


Advertisement
Advertisement
Advertisement