క్రీడలపై ఆసక్తి చూపేవారికి అదనపు క్రెడిట్స్‌

ABN , First Publish Date - 2022-05-26T05:56:19+05:30 IST

జేఎన్టీయూకే, మే 25: క్రీడల పట్ల ఆసక్తి చూపే విద్యార్థులకు అదనపు క్రెడిట్స్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. వర్సిటీలోని సెనేట్‌హాల్లో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విశ్వవిద్యాలయ అనుబంధ, క్యాంపస్‌ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్ల 14వ జనరల్‌ బాడీ సమావేశాన్ని, ఫిజికల్‌ లిటరసీ అండ్‌ వెల్‌నెస్‌ పారడిమ్‌ ఇన్‌

క్రీడలపై ఆసక్తి చూపేవారికి అదనపు క్రెడిట్స్‌
మాట్లాడుతున్న ఉపకులపతి ప్రసాదరాజు

జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు

జేఎన్టీయూకే, మే 25: క్రీడల పట్ల ఆసక్తి చూపే విద్యార్థులకు అదనపు క్రెడిట్స్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. వర్సిటీలోని సెనేట్‌హాల్లో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విశ్వవిద్యాలయ అనుబంధ, క్యాంపస్‌ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్ల 14వ జనరల్‌ బాడీ సమావేశాన్ని, ఫిజికల్‌ లిటరసీ అండ్‌ వెల్‌నెస్‌ పారడిమ్‌ ఇన్‌ హయ్యర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌, ఏ ఛాలెంజ్‌ అండ్‌ ఏ పాజిబిలిటీ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. వీసీ ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా, గౌరవఅతిథులుగా రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, డీఏపీ కేవీఎ్‌సజీ మురళీకృష్ణ, యూనివర్సిటీ స్సోర్ట్స్‌ గేమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జి.అబ్బయ్య పాల్గొనగా కార్యక్రమానికి వర్సిటీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలల్లో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు పీడీలకు ర్యాటిఫికేషన్‌ నిర్వహించామన్నారు. బ్రిటన్‌లోని ఇంటర్నేషనల్‌ ఫిజికల్‌ లిటరసీ అసోషియేషన్‌ అంబాసిడర్‌ అశి్‌షకుమార్‌రావత్‌ రిసోర్స్‌పర్సన్‌గా విచ్చేయగా గోవా నుంచి అమిత్‌ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలను అలవాటుగా చేసుకునేలా పీడీలు కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రొఫెసర్‌ జి.అబ్బయ్య నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సందర్భంగా సత్కరించారు. పీడీలు వెంకటేశ్వరరావు, మహిదుర్గ పాల్గొన్నారు.


నీటి వనరులపై వర్క్‌షాప్‌

యూసీఈకే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏపీలో నీటివనరులు అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు పాల్గొనగా విశిష్టఅతిథిగా జి.అబ్బయ్య, గౌరవ అతిథులుగా ఎన్‌ఐహెచ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వైఆర్‌ సత్యాజీరావు, గౌహతిలోని ఎన్‌ఐహెచ్‌ శాస్త్రవేత్త ఎస్వీ విజయకుమార్‌ పాల్గొనగా రిసోర్స్‌పర్సన్‌గా డాక్టర్‌ ఫణీంద్ర, సమన్వయకర్తలుగా సూర్యరమ, మైనర్‌బాబు వ్యవహరించారు. 





Updated Date - 2022-05-26T05:56:19+05:30 IST