లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-12T17:35:38+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.

లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

కుప్వారా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బండిపొరా జిల్లాలోని హాజిన్ ప్రాంతానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అకీబ్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలైన రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు.  ఈ గాలింపులో ఉగ్రవాది అహ్మద్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-08-12T17:35:38+05:30 IST