1900 మందిని గుర్తించి, కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం : జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్

ABN , First Publish Date - 2020-04-10T20:56:11+05:30 IST

జమ్మూ కశ్మీర్ ప్రాంతం నుంచి నిజాముద్దీన్ సదస్సుకు హాజరైన వారిని గుర్తించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము శుక్రవారం ప్రకటించారు. 1900

1900 మందిని గుర్తించి, కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం : జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రాంతం నుంచి నిజాముద్దీన్ సదస్సుకు హాజరైన వారిని గుర్తించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము శుక్రవారం ప్రకటించారు. 1900 మందికి నిజాముద్దీన్ సదస్సుతో లింక్ ఉందని, వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వారందర్నీ ఐసోలేషన్ వార్డులో ఉంచామని, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని అన్నారు. 17,000 ఎన్ 95 మాస్కులు వాడుతూ, 13,000 పీపీఈ కిట్స్ వాడుతున్నామని, 200 వెంటిలేటర్ల సహాయంతో కోవిడ్  - 19 మహమ్మారిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 34 రెడ్ జోన్లను గుర్తించామని, ఏప్రిల్ 14 తర్వాత కూడా ఇబ్బంది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తామని ముర్మూ స్పష్టం చేశారు.  

Updated Date - 2020-04-10T20:56:11+05:30 IST