జీవో 7ను రద్దు చేయాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2022-01-29T05:11:49+05:30 IST

మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగించే జీవో నెంబర్‌ 7ను రద్దు చేయాలని సీఐటీయూ, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

జీవో 7ను రద్దు చేయాలి: సీఐటీయూ

నంద్యాల, జనవరి 28: మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగించే జీవో నెంబర్‌ 7ను రద్దు చేయాలని సీఐటీయూ, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు తోట మద్దులు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, జీవో ఆర్టీ నెంబర్‌ 1615 అమలు చేయాలని కోరారు. ఈనెల 31న చలో విజయవాడను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మహమ్మద్‌ గౌస్‌, భాస్కరాచారి, రామకృష్ణ, ఆదామ్‌, కరీముల్లాతోపాటు మున్సిపల్‌ కార్మికులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T05:11:49+05:30 IST