‘జాక్‌పాట్’ కొట్టనున్న జితిన్ ప్రసాద!

ABN , First Publish Date - 2021-06-11T20:28:52+05:30 IST

రావడం రావడం రావడమే యువ నేత జితిన్ ప్రసాద జాక్‌పాట్ కొట్టేశారు. అతి త్వరలోనే జితిన్ ప్రసాద

‘జాక్‌పాట్’ కొట్టనున్న జితిన్ ప్రసాద!

లక్నో : రావడం రావడమే యువ నేత జితిన్ ప్రసాద జాక్‌పాట్ కొట్టేశారు. అతి త్వరలోనే జితిన్ ప్రసాద యోగి కేబినెట్‌లో చేరబోతున్నారు. అతి త్వరలోనే ఆయన్ను ఎమ్మెల్సీగా బీజేపీ నామినేట్ చేయనుంది. ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన తర్వాత ఆయనకు మంత్రిత్వ బాధ్యతలను అప్పజెప్పనుంది బీజేపీ అధిష్ఠానం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం. జూలై మాసంలో యూపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని బీజేపీ అధిష్ఠానం జితిన్ ప్రసాదతో భర్తీ చేయబోతోంది. సీఎం యోగి బ్రాహ్మణులను తన పాలనలో నిర్లక్ష్యం చేశారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వాదనలతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జితిన్ ప్రసాదకు మంత్రిత్వ బాధ్యతలు అప్పజెబితే, బ్రాహ్మణుల ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుందని బీజేపీ వ్యూహకర్తల ఆలోచన. 



Updated Date - 2021-06-11T20:28:52+05:30 IST