Abn logo
Apr 8 2021 @ 16:37PM

పీవి శతజయంతి ఉత్సవాలను జయ ప్రదం చేయండి

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవి నర సింహారావు శతజయంతి ఉత్సవాలను జయ ప్రదం చేయలని యూనిటి ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్ రావు పిలుపునిచ్చారు.పీవి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 15 సామాజిక సేవా సంస్థలు, పీవి అభిమాన సంఘాలు దేశవ్యాప్తంగా 12 రంగాలకు చెందిన విశిష్ట సేవలందించిన 81 మంది తెలుగువారికి మన తెలుగుతేజం జాతీయ అవార్డులు అందజేస్తున్నట్లు పీవి శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, మన తెలుగు తేజం జాతీయ అవార్డుల కన్వీనర్ పి.వెంకటరమణ గుప్త తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 9న బి.ఎం.బిర్లా మ్యూజియంలోని భాస్కర ఆడిటోరియంలో మధ్యాహ్నం 3గం.లకు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement