Abn logo
Feb 14 2020 @ 01:24AM

4జీ డౌన్‌లోడ్‌ వేగంలో జియో టాప్‌

న్యూఢిల్లీ: జనవరిలో 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.9 మెగాబైట్ల (ఎంబీపీఎస్‌) వేగంతో జియోలో డేటా డౌన్‌లోడ్‌ అవుతుండగా.. 4జీ అప్‌లోడ్‌ వేగంలో వొడాఫోన్‌ అగ్రస్థానం దక్కించుకుంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గత ఏడాది నవంబరులో 27.2 ఎంబీపీఎ్‌సతో ఉన్న జియో, ఈసారి 20.9 ఎంబీపీఎస్‌ కు పడిపోయినా.. తొలిస్థానంలోనే నిలవడం గమనార్హం. తర్వాతి స్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ (7.9 ఎంబీపీఎస్‌) కంటే జియో మూడు రెట్లు వేగంగా ఉందని ట్రాయ్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement