Jio Phone Next అమ్మకాలు ప్రారంభం.. కొనాలంటే ఇది తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-11-07T18:33:59+05:30 IST

యో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఫోన్ కొనాలంటే ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఫోన్ కొనాలనుకునేవారు స్టోర్‌కు వెళ్లడానికి ముందుగా

Jio Phone Next అమ్మకాలు ప్రారంభం.. కొనాలంటే ఇది తప్పనిసరి!

హైదరాబాద్: జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఫోన్ కొనాలంటే ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఫోన్ కొనాలనుకునేవారు స్టోర్‌కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్సైట్(https://www.jio.com/next) ద్వారా నమోదు చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం 7018270182కు Hi అని మెసేజ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం వినియోగదారులు తమ లొకేషన్‌ను షేర్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వచ్చిన తరువాత వినియోగదారులు జియో ఫోన్ నెక్ట్స్‌ను కొనేందుకు వీలవుతుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. 


జియో ఫోన్ నెక్ట్స్ అసలు ధర రూ.6,499. ఈ ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఇందులో వినియోగదారులు మొదటగా రూ.1,999 చెల్లించాలి. దానికి అదనంగా రూ. 501 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఫోన్‌ను తీసుకునేందుకు ఒకటి లేదా రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్‌కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30 వేలకుపైగా రిటైల్ అవుట్ లెట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేపర్‌లెస్ డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. 


జియో ఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ నెక్ట్స్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. భారతదేశం కోసం తయారు చేసిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్. ఇది 5.45 అంగుళాల హెచ్‌డి+ (720x1,440 pixels) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా విభాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రీలోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ – కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ4.1, వై-ఫై, డ్యూయల్ సిమ్ నానో స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్‌ను పొందుతుంది. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి. 


జియో ఫోన్ నెక్ట్స్ కోసం రూ.1,999 చెల్లిస్తే, జియో అందించే ఈ EMI ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు





Updated Date - 2021-11-07T18:33:59+05:30 IST