జీవో నెంబరు 50ని వెంటనే అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T04:47:14+05:30 IST

నాయిబ్రాహ్మణుల పట్ల కులవి వక్షత లేకుండా ప్రభుత్వ తీసుకొచ్చిన జీవోనెంబరు 50ని వెంటనే అమలు చేయాలని అన్నమయ్యజిల్లా ఏపీ నాయీ బ్రాహ్మణ సేవాసంఘం, మదన పల్లె జ్యోతిరావుపూలే నాయీ బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కోరారు.

జీవో  నెంబరు 50ని వెంటనే అమలు చేయాలి
మాట్లాడుతున్న జ్యోతీరావ్‌పూలే నాయిబ్రాహ్మణ సేవాసంఘం జిల్లాఅధ్యక్షుడు సుబ్రహ్మణ్యం

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 16: నాయిబ్రాహ్మణుల పట్ల కులవి వక్షత లేకుండా ప్రభుత్వ తీసుకొచ్చిన జీవోనెంబరు 50ని వెంటనే అమలు చేయాలని అన్నమయ్యజిల్లా ఏపీ నాయీ బ్రాహ్మణ సేవాసంఘం, మదన పల్లె జ్యోతిరావుపూలే నాయీ బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిద్దవటం యానాదయ్య చొరవతో  ప్రభుత్వం నుంచి జీవో నెంబరు 50ని తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక నుంచి మంగలవాడు, మంగళి, మంగళది, కొండమంగళి అనే పదాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో పెళ్లిలు, ఊరేగింపులు, శుభ, అశుభ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కూడా కులవివక్షతకు గురికాకుండా ఉంటారన్నారు.  కారక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆవుల విశ్వనాఽథ, రాష్ట్ర కార్యదర్శి బురుగు సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, మంజునాధ, బాలసుబ్రహ్మణ్యం, విజయకుమార్‌, నరసింహులు, సూరీ, అమరనారాయణ, బాబయ్య, వెంకటేష్‌, శివశంకర్‌, మునిరాజ, ఆనంద్‌, మోహన్‌బాబు, కరుణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-08-17T04:47:14+05:30 IST