Abn logo
Jul 30 2020 @ 00:40AM

జియో ఫైబర్‌లో వాటాపై ‘ఖతార్‌’ ఆసక్తి

రూ.11,200 కోట్ల పెట్టుబడులు పెట్టే చాన్స్‌ 


ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.1.50 లక్షల కోట్లకు పైగా సేకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌స (ఆర్‌ఐఎల్‌).. ఇక జియో ఫైబర్‌ ఆస్తుల అమ్మకంపై దృష్టిసారించింది. జియో డిజిటల్‌ ఫైబర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఖతార్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (క్యూఐఏ) 150 కోట్ల డాలర్లు (సుమారు రూ.11,200 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిసింది. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 5జీ సేవలకు సిద్ధమవుతున్న తరుణంలో వ్యయాల నియంత్రణ కోసం జియోను అసెట్‌ లైట్‌ డిజిటల్‌ కంపెనీగా మార్చాలని రిలయన్స్‌ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే ఫైబర్‌ ఆస్తుల్లో వాటాలు విక్రయిస్తోందని వారు తెలిపారు. జియో ఫైబర్‌ తన ఫైబర్‌ ఆప్టిక్‌ ఆస్తులను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ (ఇన్వ్‌ఐటీ)గా నిర్వహిస్తోంది. ఈ ఆస్తుల అమ్మకం కోసం సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌, మొయిలిస్‌ అండ్‌ కో, ఐసీఐసీఐ సెక్యూరిటీ్‌సను ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లుగా రిలయన్స్‌ నియమించుకుంది. 

Advertisement
Advertisement
Advertisement